ఆంధ్రా లయోలా ఇనిస్టిస్టూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీకి గ్రీన్ ఛాంపియన్ అవార్డు

సోమవారం, 20 సెప్టెంబరు 2021 (11:42 IST)
స్వచ్ఛత, పారిశుద్ధ్యం, పచ్చదనం, నీటి నిర్వహణ, శక్తి నిర్వహణలో జిల్లాను రోల్ మోడల్ గా నిలిపినందుకు విజయవాడ ఆంధ్రాలయోలా ఇన్సూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలకు జాతీయ అవార్డును ఉన్నత విద్యా శాఖకు చెందిన మహాత్మాగాంధి నేషన్స్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రకటించింది. ఈ అవార్డను లయోల కళాశాలకు పర్యావరణ ఇన్చార్జి డా. వివి. ప్రభాకరరావు, కళాశాల డైరెక్టరు ఫ్రాన్సిస్, పిన్సిపాల్ మహేష్ ల‌కు ప్ర‌దానం చేశారు. అవార్డు తో పాటు 5 వేల రూపాయల‌ నగదు, డిస్ట్రిక్టు గ్రీన్ ఛాంపియన్ సర్టిఫికేట్ ను కలెక్టరు జె . నివాస్ చేతుల మీదుగా అందుకున్నారు. 
 
ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ, స్వచ్చత కార్యక్రమాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణా అంశాలలో విజయవాడలోని లయోలా కళాశాలకు జాతీయ స్థాయి రావడం చాలా సంతోషం అన్నారు. స్వచ్చత కార్యక్రచరణ ప్రణాళికతో పారిశుద్ధ్యం పరిశుభ్రత , పచ్చదనం నీటిన నిర్వహణ , శక్తి నిర్వహణ ముఖ్యమైన అంశాలు అన్నారు. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు ఈ కార్యక్రమాలు దోహద పడతాయన్నారు. అధ్యాపకుల మార్గదర్శకత్వంలో ఉన్నత విద్యాసంస్థల విద్యార్థుల భాగస్వామం ద్వారా దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుదామనేనిది విద్యా సంస్థల ద్వారా మాత్రమే సాద్యమవుతుందన్నారు . విద్యార్థులు పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ జిల్లాను స్వచ్చ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఇటువంటి అవార్డులు ఎంతో స్ఫూర్తిని అందిస్తాయని కలెక్టరు జె.నివాస్ అన్నారు.            

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు