రాగితో చేసిన ఆహార పదార్థాలు..
ఎప్పుడూ రాత్రి పూట ఇడ్లీ, దోసె, చపాతీలను తీసుకుంటూ వుంటారు. అయితే బియ్యం పిండితో చేసిన ఇడ్లీ, దోసెలు కాకుండా గోధుమ చపాతీలు కాకుండా కూరగాయలతో పాటు చపాతీలు తీసుకోవచ్చు. ఇంకా రాగిపిండితో చేసిన ఆహార పదార్థాలను రాత్రిపూట తీసుకుంటే బరువు తగ్గుతారు. అయితే ఈ ఆహారాన్ని రాత్రి 8 గంటలకు ముందే తీసుకోవాలి. అప్పుడు సులభంగా జీర్ణం అవుతుంది. రాగిలో ఇనుము, పీచు పదార్థాలు వుండటం వల్ల డయాబెటిస్ దరిచేరదు. ఇందులో కెలోరీలు తక్కువ. తద్వారా బరువు సులభంగా తగ్గుతారు. అందుకే రాత్రిపూట రాగిదోసె లేదా రాగి చపాతీలు తీసుకోవాలి.
అదేవిధంగా రాత్రిపూట ఓట్స్ ఇడ్లీలు తీసుకోవాలి. ఇందులో కెలోరీలు చాలా తక్కువ. పీచు అధికం. ఇది బరువు తగ్గేవారికి మంచి ఆహారం. వీటితో పాటు రాత్రిపూట ఆహారం తీసుకోకుండా నిద్రించేవారు పోషకాలతో కూడిన.. సులభంగా జీర్ణమయ్యే వెజిటబుల్ సూప్ తీసుకోవడం బెస్ట్ ఛాయిస్. ఇందులో విటమిన్లు, పీచు, మినరల్స్, ధాతువులతో కూడుకున్నది.
అలాగే పెసరప్పుతో తయారు చేసిన కిచిడీ రాత్రి పూట తీసుకోవడం మంచిది. చివరిగా బరువు తగ్గాలనుకునేవారు రాత్రి పూట శెనగలతో సలాడ్ తీసుకోవచ్చు. వీటిలో పోషకాలు పుష్కలం. బాగా ఉడికించిన శెనగలతో.. సన్నగా తరిగిన టమోటాలు, ఉల్లి, కొత్తిమీరను జోడించి సలాడ్‍గా తీసుకోవడం మంచిది. తద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు.