ముఖ్యంగా కుప్పంలో సీఎం చంద్రబాబు వెనుకబడ్డారు. కౌంటింగ్ రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయన వెనుకంజలో ఉన్నారు. అక్కడ వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి 357 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక 110 స్థానాల్లో వైసీపీ లీడింగ్‌లోకి వచ్చింది. టీడీపీ 25 సీట్లలో ముందంజలో ఉంది. మరోవైపు, మంగళగిరిలో లోకేశ్ వెనుకంజలో ఉన్నారు. లోక్‌సభ విషయానికి వస్తే వైసీపీ 11 స్థానాల్లో లీడ్‌లో ఉండగా, 5 స్థానాల్లో టీడీపీ ఉంది.
కరీంనగర్, మహబూబ్ నగర్ లాంటి స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు టీఆర్ఎస్‌కు పోటీ ఇస్తుండగా... మల్కాజ్ గిరి, నల్లగొండ, చేవెళ్ల వంటి చోట కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది.