ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ : శాఖల వారీగా కేటాయింపులు.. ఆర్టీసికి రూ.వెయ్యి కోట్లు

శుక్రవారం, 12 జులై 2019 (13:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సర్కారు తన తొలి వార్షిక బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌ను విత్తమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఇందులో వివిధ శాఖలకు కేటాయించిన బడ్జెట్ కేటాయింపులను పరిశీలిస్తే, 
 
* ఆర్టీసీకి రూ. వెయ్యి కోట్లు
* ఆరోగ్య శ్రీకి రూ.1740 కోట్లు
* వైఎస్సార్‌ రైతు భరోసాకు రూ.8,500 కోట్లు
* వ్యవసాయానికి రూ.28,886 కోట్లతో బడ్జెట్‌ రూపకల్పన
* నవరత్నాల అమలుకు బడ్జెల్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు
* వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకకు రూ.18,000 కోట్లు, అమ్మఒడికి రూ.6,500 కోట్లు
 
* పాఠశాలలో మౌలిక వసతులకు రూ. రెండువేల కోట్లే
* ఆస్పత్రులకు మౌలిక వసతులకు రూ. రెండువేల కోట్లు
* పంటల బీమాకు రూ.2,163 కోట్లు కేటాయింపు అవకాశం
* ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ.12 వేల కోట్లు కేటాయింపు
* విపత్తుల నిర్వహణ నిధికి రూ.2వేల కోట్లు కేటాయించే అవకాశం
* గృహనిర్మానానికి రూ. 8వేల కోట్లు, జలవనరులకు రూ.12 వేల కోట్లు
 
* బీసీ సంక్షేమానికి రూ.7271 కోట్లు
* సాగునీటి శాఖకు రూ.19139 కోట్లు
* రాజధాని అమరావతికి రూ.500 కోట్లు
* ఉచిత విద్యుత్ పథకానికి రూ.4,525 కోట్లు
* ఫసల్ యోజనా బీమా పథకానికి రూ.1,163 కోట్లు
* పాఠశాలల మౌలిక సదుపాయాల కోసం రూ.160 కోట్లు
* వైఎస్ఆర్ స్కూలు గ్రాంటు నిర్వహణ కోసం రూ.160 కోట్లు
* అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయింపులు చేసే అవకాశం
* ధరల స్థిరీకరణ నిధి రూ.3వేల కోట్లు, విద్యుత్‌ రాయితీకి రూ.5 వేల కోట్లు
 
* వైఎస్ఆర్ బీమాకు రూ.404 కోట్లు 
* విత్తనాల సరఫరాకు రూ.200 కోట్లు
* గ్రామ వలంటీర్లకు రూ.720 కోట్లు
* బియ్యంపై సబ్సీడీకి రూ.3వేల కోట్లు
* కడప స్టీల్ ప్లాంట్‌కు రూ.250 కోట్లు
* వైఎస్ఆర్ గృహవసతికి రూ.6 వేల కోట్లు
*  కాపు కార్పొరేషన్‌కు రూ.2వేల కోట్లు
* వడ్డీలేని రుణాల కోసం రూ.1140 కోట్లు
* వైఎస్ఆర్ కళ్యాణ్ కానుకకు రూ.300 కోట్లు
 
*  వైఎస్ఆర్ అర్బన్ హౌసింగ్‌కు రూ.వెయ్యి కోట్లు
* మధ్యాహ్న భోజన పథకానికి రూ.1077 కోట్లు
* అమ్మ ఒడి పథకానికి రూ.6455 కోట్లు
* అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1150 కోట్లు 
* పంటల బీమాకు రూ. 2,163 కోట్లు
* ఉపాధి హామికి రూ.500 కోట్లు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు