ఇదేమి పర్చూరు అనుకున్నావా... శాననసభ.. వళ్లు దగ్గరపెట్టుకో : సీఎం జగన్ వార్నింగ్

శుక్రవారం, 12 జులై 2019 (11:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా, టీడీపీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి డైరెక్టుగా వార్నింగ్ ఇస్తున్నారు. ముందుగా అచ్చెన్నాయుడుకు వార్నింగ్ ఇచ్చిన జగన్.. ఆ తర్వాత పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకు గట్టిగా హెచ్చరిక చేశారు. ఏం.. ఇదేమి పర్చూరు అనుకుంటున్నావా? శాసనసభ.. వళ్లు దగ్గర పెట్టుకో అంటూ హెచ్చరించారు. 
 
వడ్డీ లేని రుణాలపై సీఎం జగన్ మాట్లాడేందుకు ప్రయత్నించగా, టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్... పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. 
 
'ముఖ్యమంత్రిగా ఇటువైపు నుంచి మా వర్షన్ మేము ఇస్తావుంటే... కనీసం వినాలన్న ధ్యాస కూడా లేకుండా మీరేం చేస్తావున్నారు? ఇదే మేము చేసివుంటే... మీ చంద్రబాబునాయుడు మాట్లాడివుండేవారా? మీరు మాట్లాడివుండేవారా?... ఏం...ఏం...ఏం ఏమయ్యా?... ఏమి? పర్చూరనుకున్నారా? శాసనసభ ఇది. ఎట్లాంటి వాళ్లను తయారు చేశారయ్యా మీరు... నాకు అర్థం కావడం లేదు. మొత్తం రౌడీలను, మొత్తం గూండాలను తయారు చేసుకుని వచ్చినారు' అంటూ జగన్ మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు