ఏపీ మంత్రివర్గం నిర్ణయాలు ఇవే...

గురువారం, 18 జులై 2019 (12:46 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏపీ మంత్రివర్గం గురువారం సమావేశమైంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే, ఆక్వా రైతులకు యూనిట్ కరెంటు రూ.1.50కే ఇవ్వాలని నిర్ణయించింది. 
 
గడువు తీరిన స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల నియామకానికి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పార్కుకోసం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం విక్రుతమాల గ్రామంలో ఏపీఐఐసీకి 149 ఎకరాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీ వర్కర్లకు రూ.11,500, మిని అంగన్ వాడీ వర్కర్లకు రూ.7వేలు, అంగన్ వాడీ హెల్సర్‌కు రూ.7 వేలు జీతాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 
 
జులై నుంచి పెంపుదల వర్తింపు పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా భావిస్తున్న గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు కేబినెట్ ఆమోదముద్రవేసింది. ప్రభుత్వ వ్యవస్థలను ప్రతి గ్రామం ముంగిటకు తీసుకురావడమే ప్రధాన ఉద్దేశమని, ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ, వీరికి నెలకు రూ.5 వేలు ఇచ్చేందుకు అంగీకారం, పంచాయతీరాజ్ శాఖకు గ్రీన్ సిగ్నల్ పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే తరహా వ్యవస్థకు కేబినెట్ ఆమోదముద్రవేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు