ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోని సభ్యులకు శాఖలను కేటాయించారు. ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేశ్‌కు విద్య (హెచ్‌ఆర్‌డీ), ఐటీ, ఆర్టీజీ శాఖలు ఇవ్వగా, కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ అప్పగించారు.
చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి - టీడీపీ - సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు
పవన్ కల్యాణ్ - ఉప ముఖ్యమంత్రి - జనసేన - పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ - పర్యావరణం, శాస్త్ర, సాంకేతికత
నారా లోకేశ్ - టీడీపీ - విద్య (మానవ వనరుల అభివృద్ధి); ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఆర్టీజీ
అచ్చెన్నాయుడు - తెదేపా - వ్యవసాయం; సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, పాడి అభివృద్ధి & మత్స్య
కొల్లు రవీంద్ర - తెదేపా - గనులు & భూగర్భ; అబ్కారీ
నాదెండ్ల మనోహర్ - జనసేన - ఆహార, పౌర సరఫరాలు; వినియోగదారుల వ్యవహారాలు
పి.నారాయణ - తెదేపా - పురపాలక & పట్టణాభివృద్ధి
వంగలపూడి అనిత - తెదేపా - హోం మరియు విపత్తు నిర్వహణ
సత్యకుమార్ యాదవ్ - భాజపా - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య
ఎన్. రామానాయుడు - తెదేపా - జలవనరుల అభివృద్ధి
ఎన్.ఎమ్.డి ఫరూక్ - తెదేపా - న్యాయ శాఖ, మైనారిటీ సంక్షేమం