ఈ అధికారులలో చాలా మంది బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కానీ ఇంత వరకు ఎవరెవరికి ఎక్కడెక్కడ స్థలం ఇచ్చారో చూపించలేదు. అంటే ఇంకా వారి ప్లాట్లను అభివృద్ది చేయలేదు అసెంబ్లీ ఆఖరి రోజు ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనతో 500గజాల స్థలాలను కొనుగోలు చేసిన ఐఎఎస్ అధికారులు ఖంగుతిన్నారు. డీలా పడ్డారు. పరిపాలనకు సంబంధించిన రాజధాని ఇక్కడ లేనప్పుడు 500 గజాలలో ఇళ్లు ఎలా ఎట్టుకోవాలి. ఉద్యోగాలు చేసేది విశాఖపట్నంలో.. అమరావతిలో ఇల్లు కట్టుకుని ఏం చేయాలి.