నిండుకున్న గల్లాపెట్టె : అమ్మఒడి - జగనన్న దీవెనలకు ల్యాప్‌టాప్

శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (13:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత ఏర్పడింది. ముఖ్యంగా, జగనన్న అమ్మఒడి, వసతి దీవెన పథకాలకు బదులుగా ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. 
 
ఇందుకోసం ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండరు నోటీస్ జారీ చేయాలని నిర్ణయించింది. ల్యాప్‌టాప్‌ల కొనుగోలు టెండరు విలువ వంద కోట్ల రూపాయల పరిమితి దాటడంతో టెండరు నోటీసులోని అంశాలను న్యాయసమీక్షకు పంపించింది. బేసిక్ కాన్ఫిగరేషన్‌తో 5.62 లక్షల ల్యాప్‌టాప్‌లు, ఆధునిక కాన్ఫిగరేషన్‌తో 90,926 ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండర్లు పిలవనున్నారు. 
 
ఈ సరఫరా కోసం బిడ్లు దాఖలు చేయాల్సిందిగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కోరింది. దీనిపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియచేయాల్సిందిగా ప్రజలను కోరుతూ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబరు 17 సాయంత్రం 5 గంటల్లోగా ఏపీజ్యూడీషియల్ ప్రివ్యూ ఎట్ జీమెయిల్ డాట్ కామ్​కు ఈ అభ్యంతరాలు, సూచనలు సలహాలు పంపాలని  ప్రభుత్వం స్పష్టం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు