రోజుకు సగటున రూ.205 కోట్లు అప్పు చేస్తున్న సీఎం జగన్ సర్కారు

మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (12:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకునిపోతుంది. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తుంది. సగటున రోజుకు రూ.205 కోట్లు చొప్పున అప్పు చేస్తుంది. గత 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన రుణం రూ.55 వేల కోట్లు దాటేసింది. ప్రభుత్వం చేస్తున్న అప్పులపై విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా సీఎం జగన్ మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
 
పైగా, సీఎం జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం చేస్తున్న అప్పులు సరికొత్త రికార్డులు నెలకొల్పేలా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన 9 నెలల కాలంలో ప్రభుత్వం చేసిన అప్పు స్థూలంగా రూ.55,555 కోట్లకు చేరుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు త్రైమాసికలకుగాను రాష్ట్ర ప్రభుత్వం నెలకు సగటున చేసిన అప్పు రూ.6,172 కోట్లుగా తేలింది. 
 
అందుబాటులో ఉన్న మార్గాలన్నింటిలో ప్రభుత్వం అప్పులు చేస్తుంది. ఫలితంగా గడిచిన మూడేళ్లలో ప్రభుత్వం చేసిన రుణం కేవలం రూ.34,452 కోట్లుగా ఉంది. అయితే, గత తొమ్మిది నెలల్లో ప్రభుత్వం చేసిన అప్పు ఎఫ్ఆర్‌బీఎం పరిమితులను మించిపోయి రూ.55,555 కోట్లకు చేరుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు