మిల్కా బలమైన వ్యక్తిత్వం భావి తరాలకు ఆదర్శమని కొనియాడారు. దేశం విశిష్ట క్రీడాకారుడిని కోల్పోయిందని కోట్లాది మంది హృదయాల్లో మిల్కా ప్రత్యేక స్థానం పొందారని గవర్నర్ అన్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ లో మిల్కా చెరగని ముద్ర వేశారని, గొప్ప క్రీడాకారుడిగా దేశం మిల్కాను ఎప్పుడూ స్మరిస్తుందన్నారు.
కామన్వెల్త్ క్రీడల్లో వ్యక్తిగత అథ్లెటిక్స్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి భారత అథ్లెట్ శ్రీ మిల్కా సింగ్ అని, మెల్బోర్న్, రోమ్, టోక్యోలో జరిగిన సమ్మర్ ఒలింపిక్ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించారని గవర్నర్ హరిచందన్ ప్రస్తుతించారు.
గవర్నర్ మాట్లాడుతూ, 1960 రోమ్ ఒలింపిక్స్ ఫైనల్లో 45.73 సెకన్లతో నాల్గవ స్థానంలో నిలిచి అద్భుతమైన రికార్డును శ్రీ మిల్కా సింగ్ కలిగి ఉన్నారని, 1959 లో పద్మశ్రీ అవార్డుతో గౌరవం పొందారని వివరించారు.