ప్రేయసి కి గోదారి గట్టుపైన ఫిలాసఫీ చెబుతున్న సుమంత్ ప్రభాస్

చిత్రాసేన్

శుక్రవారం, 26 సెప్టెంబరు 2025 (10:21 IST)
Sumanth Prabhas, Nidhi Pradeep
మేమ్ ఫేమస్ చిత్రం నటుడు సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా గోదారి గట్టుపైన సినిమాతో అలరించబోతున్నారు. నిధి ప్రదీప్ కథానాయికగా అరంగేట్రం చేస్తుండగా, జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. తాజాగా మేకర్స్ గోదారి గట్టుపైన ఫస్ట్ బ్రీజ్ ని రిలీజ్ చేశారు. లైట్ హౌస్ పైకి తన ప్రేమికురాలిని తీసుకెళ్లిన హీరో, గోదావరి సముద్రంలో కలిసిపోయే అద్భుత దృశ్యం చూపించే సన్నివేశంతో వీడియో ప్రారంభమవుతుంది.
 
ఇదే సంగమం.. ఇక్కడే గోదారి సముద్రంలో కలుస్తుంది. ప్రకృతి ఎంత విచిత్రమైందో కదా. మంచినీరు ఉప్పునీరు వేరువేరు తత్వాలు అయినప్పటికీ రెండు ఒకటిగా కలిసిపోతున్నాయి. మనుషులు కూడా ఇలా బేధాభిప్రాయాలు లేకుండా ఒకటిగా కలిసిపోతే ఈ మత భేదాలు అనేవి ఉండవు కదా' అని సుమంత్ ప్రభాస్ చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది.  
 
గ్లింప్స్‌ చాలా ఫ్రెష్ అండ్ సోల్ ఫుల్ గా వుంది. రచన, దర్శకత్వంలో సుబాష్ చంద్ర ఆకట్టుకున్నారు. సుమంత్ ప్రభాస్ తన పాత్రలో ఇమిడిపోయారు, నిధి ప్రజెన్స్ కట్టిపడేసింది. జగపతి బాబు పాత్రకి ఇచ్చిన పరిచయం ఆసక్తి కలిగించేలా ఉంది.
 
సాయి సంతోష్ చిత్రీకరించిన నేచురల్ విజువల్స్ కథలోని భావోద్వేగాలను మరింత అందంగా మలిచాయి. నాగ వంశీ కృష్ణ అందించిన సంగీతం అలరించింది. ప్రావల్య ప్రొడక్షన్‌ డిజైనర్‌గా, అనిల్ కుమార్ పి ఎడిటర్‌గా, నాగార్జున సౌండ్‌ డిజైనర్‌గా తమ వంతు నైపుణ్యం చూపారు.
 
హృదయాన్ని హత్తుకునే కథా నేపథ్యం, సహజమైన నటన, క్రియేటివ్ టచ్ తో ‘గోదారి గట్టుపైన’ ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతి అందించబోతోంది.
 
తారాగణం: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వివా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు