ఆంధ్రప్రదేశ్‌లో పాస్‌పోర్ట్ సేవలు పునఃప్రారంభం

శనివారం, 5 జూన్ 2021 (09:47 IST)
విజయవాడలో పాస్‌పోర్ట్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. నగరంలోని రీజియిన్ పాస్పోర్టు కేంద్రం పరిధిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి పాస్పోర్టు సేవలను అధికారులు ప్రారంభించారు.

అత్యవసరమైన వారికి సేవలందించాలన్న లక్ష్యంతోనే రోజుకు 3 గంటల మేర సేవలందించాలని నిర్ణయించారు. సాధారణ సమయంలో రోజూ సగటున 250 వరకు పాస్పోర్టు దరఖాస్తులను పరిశీలిస్తుంటారు.

ప్రస్తుత కోవిడ్ పరిస్థితులలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే కార్యాలయం పనిచేస్తుంది. కోవిడ్ నిబంధనలను అనుసరించి ప్రతి రోజూ చాలా తక్కువ సంఖ్యలోనే స్లాట్స్ కల్పించాలని అధికారులు నిర్ణయించారు. అత్యవసరమైతేనే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా రీజనల్ పాస్పోర్టు ఆఫీసర్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు