ట్రస్ట్ స్వాధీనం కోసం ధూళిపాళ్ళ నరేంద్రకు సర్కారు నోటీసులు

బుధవారం, 27 అక్టోబరు 2021 (09:59 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీచేసింది. తన ఆధీనంలో ఉన్న ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌ను స్వాధీనం చేసుకునే క్రమంలో నోటీసులు జారీ చేసింది. 
 
సహకార చట్టంలోని సెక్షన్ 6-ఏ కింద ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాగా ఈ నోటీసులను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్ లాల్ జారీ చేశారు. 
 
పైగా ఈ నోటీసులు వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. ధూళిపాళ్ల ట్రస్టు ఆధ్వర్యంలో డీవీసీ ఆసుపత్రి నడుస్తోంది. గతంలో కూడా గుంటూరులోని సంగం పాల డైరీని స్వాధీనం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇదే విధంగా నోటీసు జారీచేసింది. ఆ తర్వాత సంగం డైరీ యాజమాన్యం న్యాయపోరాటానికి దిగిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు