పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

ఠాగూర్

గురువారం, 4 సెప్టెంబరు 2025 (23:22 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం "ఓజీ" (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). ఈ నెల 25వ తేదీన విడుదలకానుంది. సుజీత్ దర్శకుడు. డీవీవీ దానయ్య నిర్మాత. అయితే, ఈ చిత్రం టిక్కెట్ల విక్రయం అపుడే మొదలైంది. ఈ సినిమా టిక్కెట్ ధర ఏకంగా రూ.5 లక్షలు పలికింది. 
 
'నా సేన కోసం నా వంతు' సభ్యులు సందీప్ ధనపాల, అరవింద్ పీసపాటిలు.. నైజా తొలి టిక్కెట్ వేలం వేశారు. టీమ్ పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా బృందం ఈ టిక్కెట్‌ను రూ.5 లక్షలకు దక్కించుకుంది. ఆ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ నాగబాబును కలిసి డీడీని అందజేశారు. 
 
ఈ సందర్భంగా టీమ్ పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా బృందాన్ని, సందీప్, అరవింద్‌లను నాగబాబు ప్రత్యేకంగా అభినందించారు. వీరంతా వివిధ హోదాల్లో పనిచేస్తూనే సమయం, అవకాశం లభించినపుడు పార్టీ బలోపేతం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకమని నాగబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు