ఒక తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో మాత్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ మాత్రమే కర్ఫ్యూ సడలింపులుంటాయి. ఇక్కడ సాయంత్రం 6 గంటలకే దుకాణాల మూసివేయాలి. కోవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం లోపు వచ్చేంత వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయి.
మరో పక్క సినిమా థియేటర్లు, జిమ్ లకు కోవిడ్ ప్రోటోకాల్స్ తో అనుమతిస్తున్నారు. సినిమాలలో ప్రేక్షకులకు సీటుకు, సీటుకు మధ్య ఖాళీ ఉండేలా థియేటర్ల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. రెస్టారెంట్లు, జిమ్స్, కళ్యాణ మండపాలు... ఇలా అన్నిచోట్లా కోవిడ్ ప్రోటోకాల్స్‌తో అనుమతి తీసుకోవాలి.
జనం ఉండేచోట కచ్చితంగా సీటుకు సీటుకు మథ్యఖాళీ తప్పని సరి. శానిటైజర్, మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి. కోవిడ్ విస్తరణను పరిగణలోకి తీసుకుంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.