మరో రూ.వెయ్యి కోట్లు రుణం తీసుకున్న ఏపీ సర్కారు

మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (16:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు రుణం తీసుకుంది. భారత రిజర్వు బ్యాంకు బాండ్లను వేలం చేయడం ద్వారా ఈ రుణాన్ని సేకరించింది. మొత్తం వెయ్యి కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది. మొత్తం రూ.వెయ్యి కోట్లలో రూ.500 కోట్లను 12 సంవత్సరాలకు 7.71 శాతం వడ్డీతోనూ, మరో రూ.500 కోట్లు రూ.7.60శాతం వడ్డీకి తీసుకుంది. దీంతో ఈ యేడాదిలో ఇప్పటివరకు ఏపీ సర్కారు తీసుకున్న మొత్తం రుణం రూ.49600 కోట్లకు చేరుకుంది. 
 
రిజర్వు బ్యాంకులో ప్రతి మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం పాటలు జరుగుతుంటాయి. గత కొంతకాలంగా ప్రతి మంగళవారం ఏపీ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఈ వేలం పాటలో పాల్గొని రుణాన్ని సేకరిస్తుంది. ఆ విధంగా ప్రతి మంగళవారం రూ.1000 కోట్ల మేరకు రుణం సేకరిస్తుంది. 
 
అయితే, గతంలో తీసుకున్న రుణానికి వసూలు చేసే వడ్డీ కంటే ఇపుడు తీసుకున్న రుణానికి విధించిన వడ్డీ శాతం అధికమనే వాదనలు వినిపిస్తున్నాయి. 
 
మరోవైపు, కేంద్రం విధించిన ఎఫ్ఆర్బీఎం పరిధిని ఏపీ ప్రభుత్వం దాటేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో నాబార్డు రుణాలు మినహా మరే ఇతర రుణాలు ఏపీ సర్కారు అందే అవకాశమే లేదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు