Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు ఊరట.. ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు

సెల్వి

మంగళవారం, 10 డిశెంబరు 2024 (15:25 IST)
Ram Gopal Varma: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని కూడా కోర్టు ఆదేశించింది. అక్టోబర్ 2023లో అతని చిత్రం వ్యుహం విడుదల సందర్భంగా, మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో వర్మ చిత్రం పోస్టర్‌లను పోస్ట్ చేయడంతో వివాదం తలెత్తింది. 
 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను అవమానించేలా పోస్టులు కనిపిస్తున్నాయని ఎం. రామలింగయ్య అనే ఫిర్యాదుదారు ఆరోపించారు. అనకాపల్లి, గుంటూరు జిల్లాల్లోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయి.
 
ఈ వ్యవహారంపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో వర్మపై ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్‌లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈనెల 10న ఏడు సెక్షన్లతో రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు. అయితే రెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ వర్మ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించగా.. వర్మకు ఊరట లభించింది. రాంగోపాల్‌ వర్మకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేస్తూ తప్పకుండా విచారణకు హాజరుకావాలని ఆర్జీవీకి హైకోర్టు సూచించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు