పబ్లిక్ రోడ్డును సొంత ఎస్టేట్‌లా వాడుకున్న పెద్దిరెడ్డి... చెంపపెట్టులా హైకోర్టు తీర్పు (Video)

వరుణ్

గురువారం, 25 జులై 2024 (22:29 IST)
గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా ఉండేది. ప్రజలు, ప్రైవేటు పార్టీలను తమ ఇష్టానుసారంగా ఆక్రమించుకుని సొంతానికి ఉపయోగించుకున్నారు. సాక్షాత్ ఒక రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రే పబ్లిక్ స్థలాన్ని ఆక్రమించుకుని పక్కా నిర్మాణాలు కట్టుకున్నారు. తమ పార్టీ అధినేత ఆక్రమించుకోగా మేము మాత్రం తక్కువా అన్న చందంగా ఆ పార్టీ నేతలు రెచ్చిపోయారు. ఇలాంటి వారిలో మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. 
 
జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని, అధికారంలో ఉండగా, అధికార మదంతో, ప్రజలకు ఉపయోగపడే రోడ్డుని, తమ సొంత ఎస్టేట్ లాగా వాడుకోవడమే కాకుండా ఏకంగా గేటుకూడా పెట్టేసుకున్నారు. ఈయనకు రాష్ట్ర హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. తన ఇంటి ముందు ప్రజలకు ఉపయోగపడే రోడ్డుకి గేటు పెట్టడంపై అభ్యంతరం తెలిపిన హైకోర్టు, వెంటనే తీసేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో స్పందించిన తిరుపతి మున్సిపల్ అధికారులు సంబంధిత రోడ్డుపై గేటు తొలగించి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఒక ఫ్యూడల్ వ్యవస్థలా నడిపిన జగన్ రెడ్డి, పెద్దిరెడ్డికి, ఈ తీర్పు చెంప పెట్టు వంటిదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.


 

జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని, అధికారంలో ఉండగా, అధికార మదంతో, ప్రజలకు ఉపయోగపడే రోడ్డుని, తమ సొంత ఎస్టేట్ లాగా వాడుకుని, గేటు పెట్టిన పెద్దిరెడ్డికి, హైకోర్టు షాక్ ఇచ్చింది. తన ఇంటి ముందు ప్రజలకు ఉపయోగపడే రోడ్డుకి గేటు పెట్టటం పై అభ్యంతరం తెలిపిన హైకోర్టు, వెంటనే తీసేయాలని… pic.twitter.com/oCGqMsODUG

— Telugu Desam Party (@JaiTDP) July 25, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు