ఫీజుల ఖరారుపై అధికారం సర్కారుకు లేదు : జీవో నిలిపివేసిన హైకోర్టు

గురువారం, 1 ఆగస్టు 2019 (17:56 IST)
ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రిసూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 38పై ఏపీ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు గత నెల 23వ తేదీన ఏపీ సర్కారు జారీ చేసిన జీవో నంబరు 38 అమలు నిలిపివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గంగారావు మధ్యంతర ఆదేశాలు జారీచేశారు. 
 
బిటెక్‌, బిఈ, ఎంటెక్‌, ఫార్మడీ, ఎంబీఏ వంటి కోర్సులకు 2018-19 ఏడాదిలో నిర్ణయించిన ఫీజులనే ఈ విద్యా సంవత్సరంలో వసూలు చేయాలంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీన్ని మదనపల్లి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీతో పాటు.. మరికొన్ని ప్రైవేటు కాలేజీలు హైకోర్టులో సవాల్ చేశాయి. 
 
ప్రభుత్వ జీవో 38 అమలు నిలిపివేయాలని కాలేజీల తరపున పలువురు న్యాయవాదులు వాదించారు. ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్.ఆర్.సి) ద్వారానే ఫీజుల్ని నిర్ణయించాలని, నేరుగా ప్రభుత్వం ఫీజులు నిర్ణయించడానికి వీల్లేదని వాదించిన కాలేజ్ తరుపున న్యాయవాదులు.. జీవో వల్ల విద్యార్థులకు నష్టం లేదన్న  ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌... ఉన్నత విద్యను శాస్త్రీయ పద్ధతిలోకి తేవాలనే ఉద్ధేశంతోనే ప్రభుత్వం జీవో 38 ఇచ్చిందన్నారు. 
 
ఫీజుల నియంత్రణ కమిటీ స్థానంలో మరో కమిటీ ఏర్పాటు అవుతుందన్నారు. అయితే, జీవో 38పై స్టే ఇచ్చిన హైకోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, తదితరులను ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు