ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే హోటల్స్, రెస్టారెంట్లు తెరుచుకోనున్నాయి. లాక్డౌన్ కారణంగా గత 70 రోజులుగా మాతపడిన హోటళ్లు, రెస్టారెంట్లను కేంద్ర విడుదల చేసిన మార్గదర్శకాలకు లోబడి తెరుచుకునేందుకు అనుమతి ఇస్తామని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.
అలాగే, పుణ్య క్షేత్రాల్లో కూడా హోటళ్లను తెరిచేలా చర్యలు తీసుకుంటాం. టూరిస్టులు, యాత్రీకుల వసతి కోసం హోటళ్లు నిర్వహిస్తూనే కోవిడ్ నివారణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. దాదాపు ప్రతి జిల్లాలోనూ టూరిజం ప్రమోషన్లో భాగంగా వివిధ ఫెస్టివల్స్ నిర్వహించాం.
పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చాలనే అంశంపై కసరత్తు చేస్తున్నాం. అరకు, గండికోట, హర్సలీహిల్స్ వంటి ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెనెన్ స్టార్ రిసార్ట్స్ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నాం. లాక్డౌన్ సమయంలో నెలకు రూ.10 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయినట్టు మంత్రి శ్రీనివాస్ వివరించారు.