ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కల్లోనానికి నిదర్శనం... పై ఫోటో. కరోనా వైరస్‌తో మృతి చెందిన భార్య మృతదేహాన్ని ఓ భర్త, కుమారుడు తమ ద్విచక్రవాహనంపై తీసుకెళ్ళారు. అదీ కూడా ఏకంగా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి తీసుకెళ్లడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ మహిళ కరోనా బారినపడి, ఆక్సిజన్ లెవల్ తగ్గిపోయింది. దీంతో కుటుంబసభ్యులు సోమవారం పలాసలోని ఆస్పత్రికి ఆటోలో తీసుకొచ్చారు.