ట్రెజరీ ఉద్యోగులంతా ఆదివారం కూడా పనిచేయాలి : ఏపీ సర్కారు

ఆదివారం, 30 జనవరి 2022 (08:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రెజరీ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. ఆదివారం కూడా పని చేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాల్లోనే ఉండి వేతన బిల్లులు క్లియర్ చేయాలంటూ ఆ ఆదేశాల్లో సూచించింది. ఈ మేరకు అన్ని ట్రెజరీ కార్యాలయాలకు వాట్సాప్ సందేశాలను పంపించింది. అలాగే, ఇతర శాఖల నుంచి వచ్చిన బిల్లులను కూడా క్లియర్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు. 
 
కాగా, కొత్త పీఆర్సీ ప్రకారం హెచ్.ఆర్.ఏను సవరించారు. విజయాడలోని హెచ్ఓడీ కార్యాలయాల ఉద్యోగులకు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు 16 శాతం పెంచారు. కాగా, ట్రెడరీ, డీడీవో సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరుక రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ ఆదేశాలు జారీచేశారు. 
 
మరోవైపు, పీఆర్సీ అంశంలో ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే ఉద్యోగులు ఆందోళనలకు ఉపక్రమించారు. ఫిబ్రవబరి 3వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం చేడుతున్న ఉద్యోగులు 7వ తేదీన నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు