గత వైకాపా ప్రభుత్వంలో తన చేష్టలతోనేకాకుండా నోటికి కూడా పని చెప్పి బూతుల మంత్రిగా ప్రత్యేక గుర్తింపు పొందిన వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని అలియాస్ కొడాలి వెంకటేశ్వర రావు ఇపుడు కనిపించడం లేదు. దీంతో ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు వీలుగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఈ మేరకు కృష్ణా జల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులను జారీచేశారు.