'పుష్ప-2' చిత్రం చూస్తూ అభిమాని మృతి (Video)

ఠాగూర్

మంగళవారం, 10 డిశెంబరు 2024 (15:39 IST)
అనంతపురం జిల్లా రాయదుర్గంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అల్లు అర్జున్ నటించిన "పుష్ప-2" చిత్రం చూస్తూ వీరాభిమాని ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాయదుర్గంలో 'పుష్ప-2' సినిమా ప్రదర్శిస్తున్న థియేటరులో ముద్దానప్ప అనే ప్రేక్షకుడు ప్రాణాలు కోల్పోయాడు.
 
షో ముగిశాక కూడా సీటులో అలానే కూర్చొని ఉండటంతో ప్రేక్షకులు అనుమానించి థియేటర్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ముద్దానప్ప అచేతనస్థితిలో పడిపువుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ముద్దానప్ప మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
మరోవైపు, ముద్దానప్ప తొక్కిసలాట వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

 

థియేటర్ లో పుష్ప-2 సినిమా చూస్తూ అల్లుఅర్జున్ అభిమాని అనుమానాస్పద మృతి

అనంతపురం జిల్లా రాయదుర్గంలో పుష్ప-2 సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ లో ముద్దానప్ప అనే ప్రేక్షకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు

షో ముగిశాక కూడా సీటులో అలానే కూర్చొని ఉండటంతో
ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యం… pic.twitter.com/dOS4l7qVlD

— BIG TV Breaking News (@bigtvtelugu) December 10, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు