రాష్ట్రంలోని కోవిడ్-19 ఆస్పత్రుల వివరాలు, క్వారంటైన్ కేంద్రాల సమాచారం, కోవిడ్ పరీక్షా కేంద్రాలతో పాటు ఏపీలోని కరోనా పాజిటివ్ కేసులు, డిశ్ఛార్జ్ అయిన వారు, మరణాల సంఖ్యతోపాటు ప్రతి రోజు ప్రభుత్వం విడుదల చేసే మీడియా బులిటెన్ సైతం ఈ యాప్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనలో ఉన్న లక్షణాలను బట్టి కోవిడ్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అంతేకాకుండా మీ ప్రాంతంలో ఉండే వార్డు వాలంటీర్, ఎఎన్ఎం, డాక్టర్ ను సంప్రదించడం తదితర వివరాలను తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ యూజర్లు https://bit.ly/30FvmBm లింక్ నుంచి ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కోవిడ్-19కి సంబంధించిన ఎలాంటి సమాచారం కోసమైనా, ఇతర సహాయం కోసమైనా జాతీయస్థాయి హెల్ప్ లైన్ 1075, రాష్ట్రస్థాయిలో 104కి కాల్ చేయవచ్చు.