నవంబరు 1న శ్రీకాకుళంలో జరిగే కార్యక్రమంలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఏడాదికి మూడు గ్యాస్ నింపే దీపం పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి గ్యాస్ కంపెనీల ప్రతినిధులకు సబ్సిడీ మొత్తాలను అందజేశారు.
అక్టోబర్ 29, మంగళవారం నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు నాలుగు లక్షలకు పైగా బుకింగ్‌లు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన మహిళలందరికీ ఉచిత గ్యాస్ సరఫరా చేస్తుందని చంద్రబాబు ప్రకటించారు.
మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని, 4 లక్షలకు పైగా బుకింగ్‌లు జరిగాయని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రోజుకు 2.5 లక్షల బుకింగ్‌లను నిర్వహిస్తామని చమురు కంపెనీలు ప్రకటించాయి.