వాట్సాప్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. పదవ తరగతి చదువుతున్న విద్యార్ధులకు, సిలబస్‌ను వాట్సాప్ సహా ఇతరత్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా విద్యార్ధులకు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా ప్రతీ పాఠశాలకూ ఓ 'వాట్సాప్ గ్రూప్'ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఒక పాఠశాలలోని విద్యార్ధులు, టీచర్లు... ఒక గ్రూపులో ఉంటారు. పదవ తరగతి పరీక్షల కోసం విద్యార్ధులకు అవసరమైన ప్రాక్టీస్ ప్రశ్నలను వాట్సాప్ మీడియా ద్వారా అందించనున్నట్లు తెలుస్తోంది.