మసాలా టీ. ఈ టీలో ఉపయోగించే అల్లం, ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాల వల్ల అనేక ఆరోగ్యకరమైన లక్షణాలు ఉంటాయి. మసాలా దినుసుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. ఇది జలుబు, దగ్గు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు, వైరస్‌లతో పోరాడటానికి సహాయపడుతుంది. అల్లం, ఏలకులు, లవంగాలు వంటివి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.