ఏపీలో కరోనా వైరస్ విజృంభణ.. 24 గంటల్లో 75మంది మృతి

గురువారం, 3 సెప్టెంబరు 2020 (19:47 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 75మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు సంఖ్య నాలుగు వేల రెండు వందలకు చేరినట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో తెలిపారు. ఇక గడిచిన 24గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 10మంది కరోనాతో మృతిచెందారు. 
 
గడిచిన 24 గంటల్లో 10వేల 199 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 4లక్షల 65వేల 730కి చేరాయి. ఇప్పటి వరకు 3లక్షల 57వేల 829 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 
 
రాష్ట్రంలో లక్షా 3వేల 701 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చిత్తూరు, గుంటూరు జిల్లాలో 9మంది చొప్పున మృత్యువాత పడ్డారు. అనంతపురం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 7గురు చొప్పున చనిపోయారు. నెల్లూరులో 6, కడపలో 5, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు