తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు

మంగళవారం, 15 మార్చి 2022 (11:01 IST)
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే తెలంగాణాలో ఈ ఎండల తీవ్రత అధికంగా ఉంది. గత వారం రోజులుగా పలు ప్రాంతాల్లో ఈ తీవ్రత పెరుగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల ఎక్కువగా నమోదవుతున్నాయి. 
 
సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు చోట్ల వడగాల్పులు వీచాయి. మంగళ, బుధవారాల్లో కూడా వడగాల్పులు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం రాష్ట్రంలో 20 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపింది. 
 
రానున్న రోజుల్లో ఏపీలోని విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, కర్నూలు, గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాల్లోని 153 మండలాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు