లైంగిక వేధింపులు, అత్యాచారాలు వంటి అకృత్యాలతో మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. మహిళలపై నేరాలు, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు ఏపీలో పెరిగాయని ఎన్సీఆర్బీ తెలిపింది. ఈ తరహా ఘటనలపై 2019లో 1,892 కేసులు నమోదవగా... 2020లో 2,942 కేసులు రికార్డయ్యాయి.
ఈ తరహా ఘటనలకు సంబంధించి 2019లో 1,892 కేసులు నమోదు కాగా.... 2020లో ఆ సంఖ్య 2,942 కు పెరిగింది. ఏడాది వ్యవధిలో ఈ తరహా ఘటనలు 23.78 శాతం మేర అధికమయ్యాయి.
అత్యధికంగా మహారాష్ట్రలో ఈ తరహా కేసులు 201 నమోదు కాగా, ఏపీలో 124 కేసులు ఉన్నాయి. మహిళలను వేధించిన ఘటనల్లో మహారాష్ట్రలో 2వేల 13, తెలంగాణలో 14వందల 38 తర్వాత... 956 కేసులతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని ఎన్సీఆర్బీ వెల్లడించింది.