రాబోయే నాలుగు రోజుల పాటు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 36-40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. అయితే, సాయంత్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ సమయంలో.. వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని.. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి వోఆర్‌ఎస్ , ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని సూచించారు. ఇక, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.