వివరాల్లోకి వెళ్తే.. తాటిపర్తికి చెందిన మాలపాటి సురేష్ రెడ్డి, పొలకూరు కావ్య సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. గతంలో బెంగళూరులో పనిచేసేవారు.. కానీ వర్క్‌ఫ్రమ్ హోం కావడంతో ఊర్లోనే ఉంటున్నారు.
సురేష్, కావ్యలు తమ ప్రేమ విషయం ఈ మధ్యే పెద్దలకు తెలిసింది. తన బంధువుల ద్వారా కావ్య తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారట. సురేష్‌తో పెళ్లికి కావ్య కుటుంబసభ్యులు అంగీకరించలేదు. సోమవారం కావ్యను ఇచ్చి పెళ్లి చేయాలని మరోసారి ఒప్పించే ప్రయత్నం చేశాడు.