అంతర్వేది నూతన రథం సిద్దం: దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
సోమవారం, 18 జనవరి 2021 (20:27 IST)
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తుల మనోభావాలకు అనుగుణంగా భక్తులను భక్తులను తరింప చేసే తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణానికి ముందే నూతన రథాన్ని సిద్దం చేయడం జరిగిందని మంత్రి వెలంపల్లి తెలిపారు.
ఫిబ్రవరి నెలలో మూడు రోజుల పాటు నూతన రథానికి వైఖాసన ఆగమ సాంప్రదాయం ప్రకారం సంప్రోక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 11న సంకల్పం, 12న ఆదివాసం, 13న అభిషేకం, పూర్ణహుతి,రథ ప్రతిష్ట జరుగుతుందన్నారు. 22వ తేదీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అనంతరం 23న కల్యాణోత్సవ రథం ఊరేగింపు కనుల పండుగగా జరుగుతుందన్నారు.
3 కోట్లు రూపాయలతో రామతీర్థం పునః నిర్మాణం
రామతీర్థం విజయనగరం జిల్లా లోని శ్రీ రామచంద్రస్వామి దేవాలయ అభివృద్ది,పునః నిర్మాణానికి మూడు కోట్లు రూపాయులు కేటాయించినట్లు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
సొమవారం బ్రాహ్మాణవీధిలో మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు అధ్యక్షతన సెక్రటరీ గిరిజా శంకర్, ప్రత్యేక కమిషనర్ పి.అర్జునరావు,ఎస్.ఈ ఎ శ్రీనివాస్,రీజనల్ జాయింట్ కమిషనర్ భ్రమరాంబ, డిఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పండితులు సలహాలు,వైఖాసన ఆగమ సంప్రదాయం ప్రకారం ఆలయ అభివృద్ది, పునః నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.విజయనగరం జిల్లా రామతీర్థం పునః నిర్మాణ పనులు ఏడాదిలో పూర్తి చేయాలని అధికారులను అదేశించారు..700 అడుగు ఎత్తులో ఉన్న ఆలయ నిర్మాణం పూర్తి రాతి కట్టడాలతో జరుతుందన్నారు.కోదండ రాముడి విగ్రహాన్ని తిరుమల తిరుపతి దేవస్తానం వారు తయారు చేసి అందజేయున్నట్లు తెలిపారు.
అదేవిధంగా రామతీర్థం మొట్లు మార్గం సరిచేయడం పాటుగా కొత్త మొట్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. దేవాలయ పరిసరాల ప్రాంతం మొత్తం విద్యుత్ దీపాలంకరణ చేయడం, శాశ్వత నీటి వసతి,కోనేటిని శుబ్రపర్చటం, అనంతరం కోనేటి చుట్టూ గ్రిల్స్ ఏర్నాటు చేయటం,ప్రాకర నిర్మాణం, హోమశాల,నివేదన శాల నిర్మాణం కూడా పూర్తి చేయడం జరుగుతుందన్నారు.