ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

దేవీ

గురువారం, 14 ఆగస్టు 2025 (19:39 IST)
Allu Aravind - Anil Ravipudi
హైదరాబాద్ లో నేడు సైమా అవార్డుల కార్యక్రమం జరిగింది. గత 13 ఏళ్ళుగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు సినిమాకు 7 జాతీయ అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా సైమా వేడుకలా చేసింది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి, లక్మీ మంచు, సాయి రాజేస్, రోహిత్, అల్లు అరవింద్ తదితలులు హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ,  ముంబై నుంచి వచ్చిన తారలు కనుక హిందీలో మాట్లాడుతున్నారు. కానీ మనది తెలుగు సినిమా. విష్ణు, బ్రింద, స్నేహితులు  కలిసి 13 ఏడాది సైమా అవార్డులు ఇవ్వడం గర్వకారణం. ప్రారంభంలో కొంచెం ఈ అవార్డులలో ఒడుదుడుగులు ఎదుర్కొన్నారు. తెలుగులో కల్చర్ తక్కవైంది. 
 
తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చాయి. తెలుగు ఇండస్ట్రీ సత్కరించకముందే సైమా గుర్తించింది. అందుకే సైమా అందరినీ కలిపి స్టేజీమీదకు తెచ్చింది. అసలు తెలుగులో పండుగగా జరుపుకోవాలి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే.  అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నాం. సైమాలో భాగమైనందుకు ఆనందంగా వుంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు