చంద్రబాబు సుదీర్ఘమైన అనుభవం తిట్టడానికా? మంత్రి కన్నబాబు
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (15:39 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి సుదీర్ఘమైన 40 ఏళ్ల అనుభవం ఉందని వాళ్ల పార్టీ ప్రచారం చేస్తోందని ఏపీ మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఉద్యోగులను బాస్టర్డ్ అని తిట్టడం వీడియోలోనే కనిపిస్తోందని.. సాధారణ
ఉద్యోగుల మీద అనుచిత భాషను చంద్రబాబు వాడారు. ఉద్యోగులు అంటే ఎంత చులకన భావన ఉందో.. ఉద్యోగులకు ఎంత గౌరవం ఇస్తారనటానికి ఇదే సాక్ష్యమని కన్నబాబు మండిపడ్డారు. మాజీ సీఎం చంద్రబాబు బాస్టర్డ్ అన్నారా? లేదా? వాళ్ల తనయుడు లోకేశ్ ఉద్యోగులను యూజ్‌లెస్ ఫెలోస్ అని తిట్టారా? లేదా? అసలు ఆ గేటులోంచి చంద్రబాబు ఎందుకు రావాల్సి అవసరం ఏముంది? శాసనసభలోకి రావటానికి చంద్రబాబుకు ప్రత్యేకమైన గేటు ఉంది. ఆ గేటులో నుంచి ఎందుకు రాలేదని మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు.
ఒకవేళ సెక్యూరిటీ వాళ్లు నియంత్రిస్తే ఉదయం 9.15 గంటలకు సభలోకి ఎలా వచ్చారని కన్నబాబు ప్రవ్నించారు. అంటే
ఉద్దేశపూర్వకంగా కావాలని రెచ్చగొట్టడానికి ప్రతిపక్షనేత ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోందని కన్నబాబు అన్నారు. ఒక సీనియర్ నాయకుడుగా కొడుకు లోకేశ్‌కు నేర్పించేది ఇదా అని కన్నబాబు ప్రశ్నించారు. ఈ పద్ధతా
నేర్పించడం ఏంటని.. దగ్గరుండి మార్షల్స్‌ను ఎలా కొట్టాలి... గేట్‌ను ఎలా తోయాలి... ఎవరిని ఎలా తిట్టాలి అనే భాష నేర్పిస్తారా అని కన్నబాబు ప్రశ్నలు సంధించారు. సభలో లేని సభ్యులు గురించి ఎందుకు మాట్లాడారు అని
టీడీపీ సభ్యులు అంటున్నారు.
మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గురించి ఎన్నిసార్లు, ఎన్నిరకాలుగా మాట్లాడారని కన్నబాబు గుర్తు చేశారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని కన్నబాబు సూచించారు. ఈ రాష్ట్రంలో ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీశారు. దీనిపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు క్షమాపణ చెబితే గౌరవం ఉంటుందన్నారు. మాలాంటి జూనియర్ సభ్యులు వాడితే ఫర్వాలేదు. 40 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే నుంచి వివిధ హోదాల్లో చంద్రబాబు పనిచేశారు. మూడు సార్లు సీఎంగా పనిచేశారు. గత శాసనసభలో సస్పెన్ష్ చేసి బయటకు తోసేశారు. రోజా, చెవిరెడ్డి భాస్కరెడ్డి ఏం జరిగిందో చెప్పారని కన్నబాబు అన్నారు.
ఆనాడు ప్రతిపక్షనేతైన వైయస్ జగన్‌మోహన్ రెడ్డికి మైక్ ఇవ్వకుండా ఎన్నో రకాలుగా అవమానాలపాలు చేశారో ఆరోజు రాష్ట్రమంతా చూసింది కాబట్టే ఈరకమైన తీర్పు వచ్చిందన్నారు. సభా గౌరవాన్ని, సభ్యుల గౌరవన్నా నిలబెట్టే విధంగా వ్యవహరించాలన్నారు. బాస్టర్డ్స్ అని ఉద్యోగులను తిట్టడం వారి మనోభావాలను దెబ్బతీస్తోందని కన్నబాబు అన్నారు. ఉద్యోగులను చాలా చులకనగా ప్రతిపక్షనేత మాట్లాడారని ఆవేదనను వారు బయటకు చెప్పుకోలేరన్నిరు. చిన్నచిన్న ఉద్యోగులు.. కచ్చితంగా చంద్రబాబు క్షమాపణ చెప్పాలని కన్నబాబు కోరారు.
క్షమాపణ చెప్పటం చంద్రబాబు గౌరవాన్ని పెంచుతుంది అనేది అర్థం చేసుకోవాలని కన్నబాబు సూచించారు. ఎక్కడబడితే అక్కడ ఏదిపడితే అది మాట్లాడితే కుదరదు అనేది వాళ్లు అర్థం చేసుకోవాలని కన్నబాబు అన్నారు. శాసనసభ ఆవరణలో ఒక నియమావళి ఉంటుంది. గతంలో వాళ్ల స్పీకర్‌లు ఇచ్చిన డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. వాటిని అమలుచేసే విధంగా శిక్షణాతరగతులు చంద్రబాబు నిర్వహిస్తారు. కాబట్టి ఉన్న కొద్ది మంది శాసనసభ్యులకు శిక్షణ పెట్టుకుంటే మంచిదని సలహా ఇస్తున్నానని కన్నబాబు అన్నారు.
దయచేసి చంద్రబాబు క్షమాపణలు చెప్పేలా స్పీకర్ ఆదేశాలు ఇవ్వాలని కన్నబాబు కోరారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. లోకేశ్ గారి గురించి ఇక్కడెందుకు మాట్లాడుతున్నారని టీడీపీ సభ్యులు అనటంపై కన్నబాబు
స్పందిస్తూ.. ఇక్కడ మాట్లాడాలని నాకు సరదా కాదు. ఇప్పుడు వేసిన సినిమాలో లోకేశ్ కూడా ఉన్నారు. ఒక మార్షల్ పీక పట్టుకొని నెట్టేస్తున్నారు. యూజ్‌లెస్ ఫెలోస్ అని లోకేశ్ తిట్టారు. తర్వాత చంద్రబాబు బాస్టర్డ్ అని తిట్టారు. ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు స్పీకర్ ఇవ్వాలని కురసాల కన్నబాబు కోరారు. ఓడిపోయిప్పుడు ఫ్రస్టేషన్ ఉంటుంది ఎవ్వరూ కాదనరు.
2050 దాకా తరతరాలుగా సీఎం ఉంటారని పబ్లిక్ మీటింగ్, పార్టీ మీటింగ్‌లలో మాట్లాడినట్లు ఉన్నారు. దయచేసి అన్నమాటలను విత్‌డ్రా చేసుకొని క్షమాపణలు చెప్తే అయిపోతుంది అని కన్నబాబు అన్నరు. బాస్టర్డ్ అనే ఆంగ్ల పదానికి తెలుగు అర్థం తీయించండని స్పీకర్‌ను కన్నబాబు కోరారు. బాస్టర్డ్ అనే మాట వాడటం ఏంటి? అర్థం అయినా తెప్పించి ప్రతిపక్ష నాయకులకు ఇవ్వండన్నారు. గత ఐదురోజుల నుంచి ఫ్రస్టేషన్‌లో టీడీపీ సభ్యులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు. 2050 దాకా అధికారంలో ఉంటామని కలలు కని అది జరగకపోయేసరికి ఫ్రస్టేషన్‌లో ఉన్నారని కన్నబాబు అన్నారు.