'గుడ్డోడా కూర్చో' ... టీడీపీ ఎమ్మెల్సీపై మంత్రి వెల్లంపల్లి ఫైర్

బుధవారం, 2 డిశెంబరు 2020 (10:20 IST)
ఏపీ అసెంబ్లీతో పాటు.. శాసనమండలి సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాలు, అధికార పార్టీ సభ్యులు, విపక్ష సభ్యుల మధ్య మాటలయుద్ధం సాగుతోంది. ఈ మాటల యుద్ధం ఒక్కో సమయంలో అదుపుతప్పుతోంది. దీంతో విపక్ష సభ్యులను మంత్రులు తూలనాడుతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. గుడ్డోడా కూర్చో అంటూ గద్దించారు. ఇది మంగళవారం జరిగిన సభా కార్యక్రమాల్లో చోటుచేసుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మంగళవారం శాసనమండలిలో పంచాయతీరాజ్‌ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా తాను ప్రతిపాదించిన సవరణను వైవీబీ చదువుతూ.. ఈ బిల్లు ప్రభుత్వానికి ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం ఎన్నికలు పెట్టడానికే భయపడుతోందని.. ఈ బిల్లు ఇప్పుడెందుకన్నారు. దీంతో అనవసరమైన మాటలెందుకని మంత్రి వెలంపల్లి అన్నారు. 
 
వెంటే వైవీబీ స్పందిస్తూ 'ముందు సింహాలు ఏమయ్యాయో చూడు సామీ? రథం తగలబడింది పట్టించుకోలేదు.. ఇది పంచాయతీరాజ్‌కు సంబంధించింది.. నీ శాఖకు సంబంధం ఏంటి' అని ప్రశ్నించారు. దీంతో మంత్రి ఆగ్రహంతో 'గుడ్డోడా కూర్చో' అని వ్యక్తిగత దాడికి దిగారు. వైవీబీ కూడా మంత్రిని ఇడియట్‌ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు