ప్రత్యేక హోదా అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశమని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కానీ, ఈ అంశాన్ని వైకాపా పాలకులు రాజకీయం చేస్తూ, వివాదం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇదే అంశంపై ఆయన మీడియాతో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశమన్నారు. ఈ నెల 17వ తేదీన కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం కేంద్ర హోం శాఖ జరుపుతున్న చర్చలు మాత్రమేనని చెప్పారు. ఇక్కడ ప్రత్యేక హోదా అంశంపై చర్చకు రాదన్నారు. అయితే, హోం శాఖ విడుదల చేసిన ప్రకటనలో పొరపాటున ఆ అంశాన్ని చేర్చారని చెప్పారు.
ఇకపోతే, వైకాపా ప్రభుత్వానికి ముస్లింలు అంటే ప్రేమ, కాపులంటే ద్వేషం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ముస్లింలకు ఏపీలో 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని, మరి కాపులకు ఎందుకు ఇవ్వరని ఆయన నిలదీశారు.