ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైవిధ్యభరితమైన నటుకు ఆస్కార్ కాకుండా మోసకార్ అనే అవార్డును ఇవ్వాలని టీడీపీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆస్కార్ అవార్డుకు మించి నటించారని ఎద్దేవా చేశారు. అందుకే జగన్ రెడ్డి ఆస్కార్ కాకుండా మోసకార్ అని ఇవ్వాలని ఆయన కోరారు.
ప్రత్యేక హోదాపై వైసీపీ లోపాయికారితనం, చేతకానితనం మరోసారి బహిర్గతమైందని ఆయన ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చనప్పుడు ప్రజలిచ్చిన పదవుల్లో కొనసాగే అర్హత లేదన్నారు. సీఎం, వైసీపీ ఎంపీలు వెంటనే వారి పదవులకు రాజీనామా చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.