బెజ‌వాడ‌లో బిజెపి నిర‌స‌న‌... పంజాబ్ సీఎం దిష్టిబొమ్మ ద‌హ‌నం!

గురువారం, 6 జనవరి 2022 (12:13 IST)
విజయవాడలోని సన్ రైజ్ హాస్పిటల్ సెంటర్ లో పంజాబ్ ముఖ్యమంత్రి చ‌ర‌ణ్ జిత్ సింగ్ దిష్టిబొమ్మను బిజెపి రాష్ట్ర నేతలు దహ‌నం చేశారు.  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్వయంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
 
ప్రధానమంత్రి నరేంద్రమోదీ  పంజాబ్ పర్యటన విషయంలొ పంజాబ్ కాంగ్రెస్  ప్రభుత్వం వ్యవహరించిన తీరు  ప్రజాస్వామ్య విరుద్దమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పంజాబ్ రాష్ట్ర డిజిపి  రూట్ మ్యాప్ క్లియర్ అయిన తరువాత  ప్రధానమంత్రి  పర్యటించే మార్గంలో నిరనసన కారులు ఏ విధంగా వస్తారని సోము వీర్రాజు ప్రశ్నించారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వస్తున్న ప్రధానమంత్రి పట్ల ఒక రాష్ట్ర  ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా అని ఆయన దుయ్యబట్టారు.
 
 
ఒక ఫ్లైఓవర్ పై ప్రధాని 20 నిమిషాలు ఉన్నారంటే,  ఆయన భద్రత పట్ల రాష్ట్రప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. టీచర్స్ కు జీతాలు ఇవ్వడం లేదని తెలంగాణాలో బండి సంజయ్ నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తారా? 317 జిఓ ఉద్యోగులకు శాపంలా మారిందని తెలంగాణా బిజెపి నిరసన తెలిపితే అందుకు  సమాధానం చెప్పకుండా నిరంకుశంగా వ్యవహరించడం అంటే  టిఆర్ఎస్  ప్రభుత్వం వైఖరి ప్రజలకు అర్ధం అవుతోందన్నారు. కన్నాలు వేసే వాళ్లు కిటికీలు కోస్తారు.. పార్టీ ఆఫీసులో కిటికీలు కోయడం ఏంట‌ని సోము వీర్రాజు ప్ర‌శ్నించారు. కేసిఆర్ కక్ష‌పూరితంగా వ్యవహరిస్తున్నార‌ని, అయినా, బండి సంజయ్ కు బెయిల్ రావడం సంతోషకరమ‌న్నారు. కెసిఆర్ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు