లంకా దినకర్‌కు షాకిచ్చిన సోము వీర్రాజు.. ఎందుకని?

మంగళవారం, 20 అక్టోబరు 2020 (13:07 IST)
బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధికార ప్రతినిధి లంకా భాస్కర్‌కు ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు తేరుకోలేని షాకించ్చారు. పార్టీ నియమనిబంధనలకు విరుద్ధంగా సొంత అజెండాతో ముందుకువెళుతున్నందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. 
 
జూలై 26న జరిగిన మీడియా చర్చలో పాల్గొన్నందుకు లంకా దినకర్‌కు బీజేపీ రాష్ట్ర శాఖ షోకాజ్ నోటీసులు జారీచేసింది. అందుకు ఆయన సరైన వివరణ ఇవ్వలేదు. ముఖ్యంగా, పార్టీ నియమాలకు విరుద్ధంగా, సొంత అజెండాతో టీవీ చర్చల్లో పాల్గొంటున్నారన్న కారణంగా వేటు వేశారు. 
 
గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వనందును పార్టీ నుంచి బహిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరక్ బీజేపీ ఆఫీస్ సెక్రెటరీ శ్రీనివాసరావు పేరుతో లంకా దినకర్‌కు సస్పెన్షన్ లేఖ అందింది. 
 
కాగా, లంకా దినకర్ గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీలో చేరారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడే ఆయన.. జాతీయ స్థాయి మీడియాలో తరుచూ కనపడుతుంటారు. ఇటు రాష్ట్రంలో అధికార పార్టీపై, అటు జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న దినకర్ నేషనల్ మీడియా కూడా మంచి గుర్తింపు సాధించారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు