మంగళవారం విద్యాశాఖపై ఆ శాఖామంత్రి నారా లోకేశ్, ప్రభుత్వ ఉన్నతాధికారులపై సమీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయిన విధానాన్ని అధికారులు వివరించారు.
ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా.. వైకాపా ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేసిందో నివేదించారు. 2014 నుంచి 2019 మధ్య ఉన్న ఉత్తమ విధానాలను ఆ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. అప్పటి పరిస్థితులను పూర్తిగా మార్చివేసి.. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రమాణాలను పెంచడానికి తీసుకుంటున్న చర్యలను మంత్రి లోకేశ్ వివరించారు.