ఢిల్లీలో బిజీగా సీఎం జగన్.. కాఫీ తాగుతూ ఉల్లాసంగా..

శనివారం, 15 ఫిబ్రవరి 2020 (17:00 IST)
Jagan
ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కేంద్రం పెద్దలతో సమావేశాలు జరుపుతూ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సీఎం జగన్ ఇప్పటికే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు.
 
తాజాగా మరికొందరు కేంద్రమంత్రులను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తనకు లభించిన కాస్త విరామంలో ఢిల్లీలోని తన నివాసం నెం.1, జన్ పథ్ లో వైసీపీ ఎంపీలతో భేటీ అయ్యారు.
 
వారితో కాఫీ తాగుతూ ఉల్లాసంగా గడిపారు. ఈ భేటీకి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, నందిగం సురేశ్ తదితరులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు