ఆయన నా తమ్ముడయ్యా స్వామీ.. ఆయన ఎవరో కాదు....

మంగళవారం, 27 డిశెంబరు 2022 (12:33 IST)
ఆయన నా తమ్ముడయ్యా స్వామీ.. ఆయన ఎవరో కాదు.. అంటూ కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
మూడు రోజుల పాటు సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటన ముగించుకుని సీఎం జగన్ ఆదివారం పులివెందుల నుంచి అమరావతి తాడేపల్లి ప్యాలెస్‌కు తిరుగు పయనమయ్యారు. సీఎం జగన్ హెలిప్యాడ్ వద్దకు చేరుకోగానే, ఓ వ్యక్తి అర్జీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. 
 
దాంతో జగన్.. ఆ ఆర్జీని పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి ఇవ్వాలని సూచించారు. ఆ వ్యక్తి మాత్రం జగన్‌కే ఇచ్చేందుకు మరోమారు అర్జీ పత్రంతో చేయిని ముందుకు సాచారు. 
 
దీంతో జగన్ కల్పించుకుని 'నా తమ్ముడయ్యా స్వామీ.. ఆయన ఎవరో కాదు' అంటూ అవినాశ్‌కే ఇవ్వమన్నారు. పైగా, ఆ అర్జీని తీసుకోవాలని అవినాశ్‌కు సైతం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  


 

Kadapa MP Avinash Reddy maa tammude kada swamy

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు