డల్లాస్ లో స్థిరపడిన నా ప్రియమైన అభిమాని ముకేష్ ఇక లేడన్న వార్తను నేను జీర్ణించుకోలేక పోతున్నాను ఇది అత్యంత దురదృష్టకరం, బాధాకరం. ముకేష్ కుటుంభ్యులకు ఎదురైన ఈ విషాదాన్ని తలుచుకుంటుంటే మనసు కలచివేస్తుంది. నేను 2012 లో డల్లాస్ వెళ్ళాను ,అప్పుడు నాకు ఘన స్వాగతం ఏర్పాటుచేసి, అద్భుత మైన గెట్ తో గెథెర్ ఏర్పాటు చేసిన వారిలో ముకేష్ ఒకరు.