అసూయకు మందు లేదు.. బీపీలు, షుగర్ తెచ్చుకుంటారు.. ఏపీ సీఎం

గురువారం, 7 ఏప్రియల్ 2022 (19:14 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో వారికి భయం పట్టుకుందని.. బాక్సులు బద్దలవుతాయనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

"ప్రధానితో గంట సేపు బేటి అయితే... ఆయన క్లాస్ పీకారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. అసూయకు మందు లేదని.., అది మంచిది కాదు.. అలాగే ఉంటే త్వరగా బీపీలు, షుగర్ వచ్చి టికెట్ తీసుకుంటారు" అంటూ సీఎం జగన్ విమర్శలు చేశారు.
 
"ప్రధానితో భేటీలో నేను తప్ప ఎవరూ లేరు.. ప్రధాని రూమ్‌లో మోదీ సోఫా కింద లేదా నా సోఫా కింద కూర్చున్నారా..? అసూయకు మందు లేదని.., అది మంచిది కాదు.. స్ట్రైట్ గా యుద్ధం చేయలేక మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారన్న జగన్ చెప్పిన అబద్దాలనే వందసార్లు చెబుతున్నారని.. ఈ గజదొంగల ముఠాకు అధికారం తప్ప వేరే ఎజెండా లేదు" అని జగన్ మండిపడ్డారు. 
 
రాష్ట్రం ఎప్పుడు బావుందో ప్రజలే ఆలోచించుకోవాలని.. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, వారి అనుకూల మీడియా మాటలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. 
 
అంతకుముందు సీఎం జగన్ విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వాలంటీర్లను సత్కరించారు. నా సైన్యానికి సెల్యూట్ అన్న జగన్.. వాలంటీర్ల సేవలను గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న చిరుసత్కారాన్ని రాష్ట్రవ్యాప్తంగా 20 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామన్నారు. 
 
సేవా వజ్ర అవార్డు కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 875 మందికి సేవా వజ్ర అవార్డు కింద రూ.30వేల నగదు, మెడల్, శాలువాతో సత్కరిస్తున్నట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు