చంద్రబాబు అస్తవ్యస్త పాలన వల్లే విద్యుత్ చార్జీలు పెంచాం : మంత్రి బాలినేని

గురువారం, 7 ఏప్రియల్ 2022 (08:54 IST)
నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సాగించిన అస్తవ్యస్త పాలన వల్లే రాష్ట్రంలో ఇపుడు విద్యుత్ చార్జీలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆరోపించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలను ఏమాత్రం ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన రవ్వంత కూడా తమకు లేదన్నారు. 
 
రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల అని ప్రచారం చేసుకునే చంద్రబాబు ఇప్పటివరకు పొత్తు లేకుండా గెలిచిన సందర్భం లేదన్నారు. అందుకే ఈ దఫా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. అదేసమయంలో టీడీపీ జనసేన కూటమి తరపున పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా లేదా అన్నది క్లారిటీ ఇవ్వాలని కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు