సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో సీఎం జగన్ భారీ ఊర‌ట.. పారిస్‌కు జగన్‌కు పర్మిషన్

గురువారం, 23 జూన్ 2022 (14:13 IST)
ఏపీ సీఎం జగన్‌కు సీబీఐ కోర్టు సానుకూలంగా స్పందించింది. పారిస్‌లో చ‌దువుతున్న త‌న కుమార్తె స్నాత‌కోత్స‌వానికి హాజ‌ర‌య్యేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ ఏపీ సీఎం జ‌గ‌న్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ప‌ట్ల సీబీఐ కోర్టు సానుకూలంగా స్పందించింది.
 
దీంతో.. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి నాంప‌ల్లి సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. ఈ మేర‌కు జ‌గ‌న్ పారిస్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమ‌తి మంజూరు చేసింది. 
 
జ‌గ‌న్ ఇద్ద‌రు కుమార్తెలు విదేశాల్లో విద్య‌న‌భ్య‌సిస్తున్న సంగ‌తి తెలిసిందే. వారిలో పారిస్‌లో చ‌దువుతున్న కుమార్తె విద్యాభ్యాసం పూర్తి కాగా, క‌ళాశాల స్నాత‌కోత్స‌వానికి రావాలంటూ జ‌గ‌న్‌ను ఆయ‌న కుమార్తె ఆహ్వానించారు.  
 
ఈ నెల 28 నుంచి 10 రోజుల పాటు పారిస్‌లో ప‌ర్య‌టించేందుకు జ‌గ‌న్‌కు కోర్టు అనుమ‌తి మంజూరు చేసింది. అయితే పారిస్ ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను సీబీఐ అధికారుల‌తో పాటు కోర్టుకు కూడా స‌మ‌ర్పించాల‌ని జ‌గ‌న్‌ను కోర్టు ఆదేశించడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు