ఏపీఈఏపీ సెట్ 2023 అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్

మంగళవారం, 9 మే 2023 (11:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీఈఏపీ సెట్-2023 హాల్ టికెట్లను దరఖాస్తుదారులు మంగళవారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని సెట్ నిర్వహణ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ రంగజనార్ధన, కన్వీనర్ ప్రొఫెసర్ శోభాబిందు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 
 
సోమవారం వరకు మొత్తం 3,37,12 దరఖాస్తులు వచ్చాయని, అందులో ఇంజనీరింగ్ 2,37,055, ఆగ్రికల్చర్, ఫార్మసికీ 99,388 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఈ రెండు విభాగాలకు కలిపి 979 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రూ.5 వేల ఫైన్‌తో ఈ నెల 12 వరకు, రూ.10 వేలతో 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. 
 
ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులకు ఈ నెల 15 నుంచి 19 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు ఈ నెల 22, 23వ తేదీల్లో పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజుకు రెండు సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 
 
19వ తేదీ ఉదయం సెషన్ మాత్రమే పరీక్షలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి ఒకటిన్నర గంట ముందు నుంచే అనుమతిస్తారని తెలిపారు. సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 08554-23411, 232248 హెల్ప్ లైన్ నెంబర్లలో సంప్రతించాలని, లేదా helpdesk apeapcet [email protected] కు మెయిల్‌లో సంప్రదించవచ్చని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు